Friendship Quotes Telugu

0
1056
Friendship Quotes Greetings In Telugu Language@gurinchi.com
Friendship Quotes Greetings In Telugu Language

Best Friendship Quotes In Telugu

ఫ్రెండ్ షిప్ సూక్తులు
We have awesome friendship quotes in Telugu 2018 latest images, and beautiful HD images for best friends, best Telugu and latest quotations for friends like both girls and boys. Awesome quotes for friendship in Telugu, you can share it for free downloads, share with your best friends and chill your friends.

“నీ స్నేహితుడు చెడ్డవాడనో లేక నిన్ను మోసం చేసాడనో వాన్ని ఆపదలో వదలకు..
నీ స్నేహితుడు చెడ్డవాడే కావచ్చు.. కాని స్నేహం అనే పదం చాలా గొప్పది”

“భాష లేనిది, బంధం వున్నది.. సృష్టిలో అతి మధురమైనది
జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే ! “

“స్నేహం కోసం ప్రాణమివ్వడం కష్టమేమీ కాదు..
అంతటి త్యాగం చేసే స్నేహితుడ్ని పొందటమే కష్టం”

“స్నేహం విలువ తెలియనివాళ్లతో కన్నా,
స్నేహం విలువ తెలిసిన వారితో స్నేహం చేస్తే ఆ బంధం కున్న గొప్ప విలువ తెలుస్తుంది”

“మీ శత్రువుకు మీ మిత్రుడిగా మారడానికి వెయ్యి అవకాశాలు ఇవ్వండి !
కానీ మీ మిత్రుడిని మీకు శత్రువుగా అవ్వడానికి మాత్రం ఏ ఒక్క అవకాశాన్ని ఇవ్వొద్దు”

“ఇచ్చింది మరచిపోవడం.. పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే నిజమైన స్నేహం”

“అంతరాత్మ మనకు మంచి స్నేహితుడు కనుక ఎప్పుడూ తన మాట వినవలసిందే ! “

“చిగురించిన స్నేహం చిరకాలం ఉంటుంది”

“కన్నీరు తుడిచేవాడు.. స్నేహితుడు కానీ.. కన్నీరు తెప్పించేవాడు కాదు”

“పెద్దగా కొట్లాట.. కానీ ఓ చిన్న సారీ (sorry ) చిలిపిగా ఓ కోపం..
కానీ ముద్దుగా ఓ నవ్వు.. బాధగా విడిపోవడం.. కానీ తియ్యగా మళ్ళీ కలయిక..
ఇదేనండీ మన ఫ్రెండ్షిప్ “

Friendship Quotes Greetings With Telugu Sukthulu@gurinchi.com
Friendship Quotes Greetings With Telugu Sukthulu

“పూసిన పూవు వాడిపోతుంది.. పండిన పండు కుల్లిపోతుంది ..
ఎండిన ఆకు రాలిపోతుంది.. కానీ నమ్మకంతో ఏర్పడిన స్నేహం ఎప్పటికీ నిలిచే ఉంటుంది”

“ప్రేమే శాశ్వతమని నీవు స్నేహమే శాశ్వతమని
నేను అశాశ్వతమైన జీవితాన్ని వ్యర్ధం చేస్తున్నాము”

“మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళాలి..
మిత్రుడు కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి !! “

“కంటిలోని కన్నీళ్ళు విలువైనవి.. పెదాల నుండి పదాలు పదునైనవి..
ప్రేమ గల హృదయం అందమైనది.. స్నేహితులు కలిగిన జీవితం అద్భుతమైనది “

“ఒకటికి పదిసార్లు గమనించు.. ఆ స్నేహాన్ని వదులుకోవలసి వస్తే వందసార్లు ఆలోచించు”

“ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంతవరకు అర్ధం కాదు.. ఒకసారి అవి చేజారిన తర్వాత అర్ధమయినా ఏమీ చేయలేం.. అది కాలమయినా.. స్నేహితులయినా.. బంధువులయినా.. చివరికి వస్తువులయినా.. ! “

“నేనున్నానని భరోసా ఇచ్చావ్.. నీకేం కాదని భుజం తట్టావ్.. భయపడితే పక్కనే నిలిచావ్.. నువ్వు ఎక్కడున్నా నాతో ఉన్నట్టే ! అందుకే నీ స్నేహం నాకు విలువైనది”

“నువ్వు పదిమందిలో ఉన్నప్పుడు మాటవరసకు పలకరించే వారికంటే
ఒంటరిగా ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నిజమైన నేస్తం ! “

“మనిషి కన్నా మనసు మిన్న.. ఆవేశం కన్నా ఆలోచన మిన్న..
ప్రాణం కన్నా త్యాగం మిన్న.. కానీ అన్నింటికన్నా.. ఎల్లకాలం ఉండే స్నేహం మిన్న”

“ఆనందం చెప్పలేనిది.. సంతోషం పట్టలేనిది..
కోపం పనికిరానిది.. ప్రేమ చెరిగిపోనిది.. స్నేహం మరవరానిది ! “

True Friendship Quotes In Telugu Language@gurinchi.com
True Friendship Quotes In Telugu Language

“స్నేహమనే చెట్టుకు నమ్మకమనే నీరు ఉన్నంతకాలం చెట్టు పచ్చగానే ఉంటుంది”

“నలుగురిలో నువ్వున్నా నీలో నువ్వు లేకుండా చేసేదే ప్రేమ
ఐతే నీలో నువ్వు లేకున్నా నీకంటూ మేము నలుగురం ఉన్నామంటూ
ధైర్యం చెప్పేదే స్నేహం”

“నిజాయితీ, నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు”

“మాటలతో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదు స్నేహమంటే
మనసులో పుట్టి మట్టిలో కలిసేంత వరకు తోడుగా వుండేదే స్నేహం”

“నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాకుంటే దండించి సరిచేసేవాడే నిజమైన స్నేహితుడు”

“ఆపదలో అవసరాన్ని బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు”

“నా స్నేహం అద్దం లాంటిది.. ఒక్కటిగా ఉన్నా నిన్నే కోరుతుంది !
వెయ్యి ముక్కలైనా ప్రతీ ముక్క కూడా నిన్నే కోరుతుంది !!  “

“నీవు చెప్పే ప్రతీ దానికి తలూపేవాడు నీ శత్రువు.. నీతో వాదించేవాడు నీ మిత్రుడు”

“పువ్వులు వాడిపోయి రాలినా మరల వసంతంలో చిగురిస్తాయి..
కానీ స్నేహం వాడిపోయి రాలితే మనకు మళ్ళీ దక్కదు”

“ఒకరి హృదయంలో జీవించడం ప్రేమకు సాధ్యమైతే..
ఒకరి హృదయంగా జీవించడం మాత్రం స్నేహానికే సాధ్యం”

Cute Friendship Quotes In telugu With Nice Images@gurinchi.com
Cute Friendship Quotes In Telugu With Nice Images

“కొన్ని స్నేహాలు చలి మంటలా గుప్పున ఎగసి చప్పున చల్లారిపోతాయి !
మరి కొన్ని స్నేహాలు మాత్రం చిరుదివ్యలా వెలిగి నిలకడగా, కడదాకా వెలుగు నింపుతాయి ! “

“స్నేహం చేయడానికి తొందరపడొద్దు ! స్నేహం చేసాక ఎప్పటికీ వదలొద్దు !! “

“స్నేహమంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు..
స్నేహమంటే అవసరాలు తీరాక వదిలి వెళ్ళేది కాదు..
ఊపిరి ఉన్నంతవరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన స్నేహం”

“నిశ్శబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి మరో హృదయం పడే తపనే ప్రేమ.
అదే కన్నీటి చుక్కను రానివ్వకుండా ఆరాటపడే హృదయమే స్నేహం”

“ప్రతి మనిషికీ మరణం ఉంటుంది.. ప్రతీ మందుకి కాల పరిమితీ ఉంటుంది..
ఇవేమీ లేనివే మన స్నేహం “

“నీ స్నేహితున్ని అతిగా నమ్మకు.. రేపు అతనే నీకు శత్రువు కావచ్చు..
శత్రువుని అతిగా ద్వేషించకు.. రేపు తనే నీకు మిత్రుడు కావచ్చు.. ఏదైనా మితిమీరకూడదు”

“జీవితమనే ప్రయాణంలో మంచి స్నేహితులు తోడుంటే ఆయాసం తెలియదు”

“నువ్వు నిజాయితీగా ఉంటే, చాలా మిత్రులు నీతోపాటూ ఉండకపోవచ్చు గానీ..
ఖచ్చితంగా సరైన వ్యక్తులే నీకు మిత్రులుగా మిగులుతారు”

“నా ఆశకు శ్వాస నీ స్నేహం.. నా ఊహకు ఊపిరికి నీ స్నేహం..
నా తనువుకు ప్రాణం నీ స్నేహం.. నా నడకకు గమ్యం నీ స్నేహం.. అందరికి ఆదర్శం మన స్నేహం”

“స్నేహం చేయడం నేర్చుకున్నాను కానీ మరచిపోవడం కాదు..
ఒకవేళ మరచిపోవలసి వస్తే ఈ లోకాన్ని మరచిపోతాను కానీ స్నేహాన్ని కాదు”

Famous Friendship Quotes In Telugu With Hd Wallpapers@gurinchi.com
Famous Friendship Quotes In Telugu With Hd Wallpapers

“పాత మిత్రులు బంగారంలాంటి వారు.. కొత్త మిత్రులు వజ్రంలాంటి వారు..
నీకు వజ్రం దొరికినట్లయితే బంగారాన్ని మర్చిపోకు !
ఎందుకంటే వజ్రపు ఉంగరానికి కూడా బంగారం అవసరం ఉంది”

“స్నేహం ఒక భావం.. భావం ఒక జీవం.. జీవం ఒక ప్రాణం.. ప్రాణం ఒక రూపం..
ఆ రూపానికి ప్రతిరూపం నీ స్నేహం”

“కవి కలం మరచినా.. కోకిల గానం మరచినా..
సూర్యుడు ఉదయించడం మరచినా ..
నేను నిన్ను మరచిపోను నేస్తమా ! “

“మన ఆలోచనలని ఏ వ్యక్తి వద్ద బహిర్గతం చేయగలమో వారే నిజమైన మిత్రులు”

“నీ కళ్ళలో కన్నీరులా జారి.. మనసులో భావంగా మారి..
నీ ఊపిరిలో శ్వాసగా చేరి.. ప్రాణం ఉన్నంత వరకు స్నేహితునిగా ఉంటాను నేస్తమా ! “

“ఒక్కసారి ప్రేమిస్తే అది జీవితాంతం బాధపడేలా చేస్తుంది..
అదే ప్రేమలోని మాధుర్యం !
ఐతే ఒక్కసారి స్నేహం చేస్తే అది జీవితాంతం బాధలో ఓదార్పునిస్తుంది !”

“మన వెయ్యి సంతోషాలు తెలిసిన మిత్రుల కన్నా ఒక్క బాధను పంచుకున్న మిత్రుడే మిన్న! “

“స్నేహం చేయడానికి మోసం చేసినా తప్పులేదు.. కానీ మోసం చేయడానికై స్నేహం చేయకు ! “

“బంధువులను ఇచ్చేది భగవంతుడే అయినా మిత్రులను చేసుకునేది మనమే !”

“స్నేహం చెయ్యడానికి తొందరపడొద్దు.. స్నేహం చేశాక ఎప్పటికీ వదలొద్దు”

Best Friendship Quotes In Telugu With Images@gurinchi.com
Best Friendship Quotes In Telugu With Images

“కాలం అన్నీ మరచిపోయేలా చేస్తుంది..
కానీ కాలాన్ని మరచిపోయేలా చేసేదే నిజమైన స్నేహం”

“నిజాయితీ లేని స్నేహితులు మన నీడ లాంటి వారు..
మనం ఎండలో (ఆనందంలో) ఉన్నంతసేపూ వెన్నంటి నడుస్తారు..
నీడలోకి (బాధలోకి) వెళ్ళగానే మాయమైపోతారు”

“కలలే జీవితానికి ఆధారం.. నమ్మకమే ఆశకు మూలం..
కష్ట సుఖాలను పంచుకోవడమే స్నేహానికి బలం”

“పూసే ప్రతీ పువ్వు వాడిపోయినా.. కాసే ప్రతీ కాయ రాలిపోయినా..
వాడిపోనిది, రాలిపోనిది మరణించనిది స్నేహమొక్కటే ! “

“స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవటమే కాదు !
నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే నేనున్నా అని భుజం తట్టి చెప్పడం ! “

“స్నేహం విలువ తెలిసినవారు ఒక స్నేహితుడి రహస్యాలను మరో స్నేహితుడు దగ్గర చెప్పరు”

“జీవితం సాధించేదాకా ! ఓటమి గెలుపొందేదాకా ! కన్నీళ్లు ఓదార్పు లభించేదాకా !
విరులు వాడిపోయి రాలే దాకా ! వెన్నెల వేకువదాకా ! స్నేహం మరణించేదాకా!! “

” జీవితంలో మనం కోల్పోయిన కొన్ని ముఖ్యమైన వస్తువులను తిరిగి మన నిజమైన స్నేహితుల వలన మాత్రమే పొందగలము ! అవి ఆశ, చిరునవ్వు, గుండె ధైర్యం !”

“మంచి మిత్రుడు,  మంచి పుస్తకం కోసం వెతుకు..
ఒకవేళ దొరికితే జీవితాంతం వదలకు !
ఎందుకంటే ఒకసారి మిస్ అయితే తిరిగి దొరకకపోవచ్చు !! “

“స్నేహమనేది రెండు దేహాల్లో ఉండే ఒకే ఆత్మ”

Also Read