Sarvepalli Radhakrishnan Quotes In Telugu

11
2115
Sarvepalli Radhakrishnan Latest Sukthulu in Telugu Language@gurinchi.com
Sarvepalli Radhakrishnan Latest Quotations in Telugu Language

Sarvepalli Radhakrishnan Quotes In Telugu

సర్వేపల్లి రాధాకృష్ణన్ సూక్తులు
Teachers have been an important part of everyone’s life. Their contribution in paving the right path needs to be applauded and one such teacher was Sarvepalli Radhakrishnan.
Get Latest 2018 Sarvepalli Radhakrishnan Famous Quotes in Telugu, Famous life Inspirational quotations about Sarvepalli Radhakrishnan in Telugu, Sarvepalli Radhakrishnan love , beautiful images of Sarvepalli Radhakrishnan quotes in Telugu, nice and awesome quotations about Sarvepalli Radhakrishnan,life and educational quotes in Telugu and kavitalu and suktulu for free download, Telugu motivations quotes of Sarvepalli Radhakrishnan and what’s app images for free download. Share with your friends and family members and with your teachers on teacher’s day social media like Facebook and what’s app.

 Famous Sarvepalli Radhakrishnan Quotes: ప్రసిద్ధమైన సూక్తులు

“చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో,
భూమిని చూసి ఓర్పును నేర్చుకో,
చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో,
ఉపాధ్యాయున్ని చూసి సుగుణాలు నేర్చుకో”

“సమర్ధులే ఎప్పుడూ నాయకత్వం వహిస్తారు, అందరికీ మార్గదర్శకులవుతారు”

“బయట కనిపించే మురికి గుంటల కన్నా మనసులో మాలిన్యం గల వ్యక్తులు ఎంతో ప్రమాదం”

“ఒక వ్యక్తిని త్వరగా అర్ధం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ అతి త్వరగా అపార్ధం మాత్రం చేసుకోవద్దు”

“ఆలోచనలు ఉద్వేగాలు ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి”

“గమ్యాన్ని చేరుకోవడం కన్నా గమ్యం వైపు అడుగులు వేయడం ముఖ్యం”

“ఆరోగ్యవంతుడికి తన పనిలో నమ్మకం ఉంటుంది”

“నిజమైన సత్యాన్ని నమ్మేవాడు అణుకువతో వుంటాడు”

“అధికార వ్యామోహం ప్రమాదకరం”

“విజయం మనిషిలో గర్వం అనే అగ్నిని రాజేస్తే… ఆ తర్వాత అది విజేత దుఃఖానికి కారణం అవుతుంది”

Sarvepalli Radhakrishnan Quotes On Life: జీవిత సూక్తులు

Most Famous sarvepalli radhakrishnan best telugu motivational quotations@gurinchi.com
Famous Sarvepalli Radhakrishnan Best Telugu Inspirational Quotes

“మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా, చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు”

“శాంతంగా సంతోషంగా ఉండేవారు ఆరోగ్యంగా జీవిస్తారు”

“మానవుడికి ప్రకృతిని ఎదిరించి నిలబడి తన గౌరవాన్ని కాపాడుకునే శక్తి ఉంది”

“జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది”

“చెడుని అడ్డుకోవడం బాధ్యత కాదు అదో హక్కు”

“సామాజిక పరిస్థితులు ఎక్కువమంది ప్రజలకు బాధాకరం కావడం వలన కమ్యూనిజం వ్యాప్తి చెందుతుంది పరిస్థితులను మార్చాలి గానీ అణగత్రొక్కడం నివారణ కాదు”

“జీవమున్న ప్రతీదానికి స్వయం నిర్ణయక శక్తి ఉంది, దానినే ఆత్మ అంటారు”

“అమూల్యమైన కాలాన్ని సార్థకం చేసుకోవడమే జన్మరహస్యం”

“గ్రంధాలయాల ద్వారా సాహిత్యం నుంచి జీవితంలోకి ప్రవేశిస్తాము”

“ప్రభుత్వ చర్యల ద్వారా మనుషులను మంచివాళ్ళుగా మార్చలేము”

Radhakrishnan Quotes On Motivation: ప్రేరణనిచ్చే సూక్తులు

Most Famous sarvepalli radhakrishnan telugu quotations
Sarvepalli Radhakrishnan Telugu Quotes

“అన్ని రకాల జ్ఞానాలలోకెల్లా అత్యుత్తమమైనది తనను తాను తెలుసుకోవడం”

“మనలో దేవుడు జీవించాలంటే గర్వం మనలో నశించాలి”

“నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే నువ్వు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి”

“నీ ప్రవర్తన మార్గదర్శకంగా ఉండాలి, పది మంది విమర్శించకుండా మసలుకో”

“నమ్మకాలను మార్చితే తప్ప ఆలోచన పెరగదు”

Sarvepalli Radhakrishnan Quotes On Education: ఎడ్యుకేషన్ సూక్తులు

Most Famous sarvepalli radhakrishnan Telugu quotations@gurinchi.com
Sarvepalli Radhakrishnan Quotes In Telugu

            “తరగతి గది ఒక ప్రసూతి గది, జ్ఞానాన్ని జన్మనిచ్చేందుకు
తరగతి గది ఒక స్మశాన వాటిక, అజ్ఞానాన్ని ఖననం చేసేందుకు
తరగతి గది ఒక కర్మాగారం, జాతి భవితను నిర్మించేందుకు
తరగతి గది ఒక న్యాయస్థానం, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు”

“చదువుకు క్రమశిక్షణ తోడైతే బంగారానికి తావి అబ్బినట్లుంటుంది”

“మంచి పనులకు పునాది క్రమశిక్షణే.. అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది”

“ఎగిరే గాలిపటం విద్యార్ధి అయితే, ఆధారమైన దారం గురువు”

“విద్యార్ధి జీవితాన్నిమలిచేది గురువే”

“చదివి అర్ధం చేసుకున్నపుడే చదివిన దానికి విలువ.. లేకపోతే అట్టి చదువరికి చెదపురుగుకి తేడా లేదు”

“విద్య లక్ష్యం సంపాదనే కాదు విద్య వివేకాన్ని, విమర్శనాశక్తిని అందించాలి”

“అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది”

“మనకున్నదానితో సంతృప్తిపడటం ఉత్తమమే కానీ, మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానం”

“పెద్దలు మనకు చదవడం నేర్పారు, కానీ ఆలోచించడానికి శిక్షణను ఇవ్వలేదు”

“అవసరం కంటే ఎక్కువ కోరేవాడు దండించవలసిన దొంగ”

“మన కలలకు కోర్కెలకు ప్రకృతి భిన్నమైనది”

“విద్య వివేకాన్ని, విమర్శనా శక్తిని అందించాలి”

Latest Images Of Sarvepalli Radhakrishnan with telugu quotes
Latest Images Of Sarvepalli Radhakrishnan
Sarvepalli Radhakrishnan Death Anniversary Images with quotes
Sarvepalli Radhakrishnan Death Anniversary Images

Also Read

11 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here