Telugu Jokes

0
2446
Telugu Jokes And Comedy With Quotes And Images@gurinchi.com
Telugu Jokes And Comedy With Quotes And Images

Telugu Jokes

తెలుగు జోక్స్

Telugu Jokes About Wife

Telugu Funny Jokes between Husband And Wife@gurinchi.com
Telugu Funny Jokes between Husband And Wife

పక్కింటావిడ రాత్రి పడుకునే టైమ్‌కి వస్తే.. ఏం చేయను?
భార్యకు పక్కింటావిడ ఏదో చెప్పింది. కోపంతో ఊగుతూ వచ్చిన భార్య భర్తతో ఇలా అంది.
భార్య : ఏవండీ నిన్న ఇంటికి వచ్చిన సునీతను ఏమని అడిగారు?
భర్త : నేను ఏం అడిగాను. మర్యాద కొద్దీ మాట్లాడాను.
భార్య : మర్యాద కొద్దీ ఏం మాట్లాడారు.?
భర్త : ఉదయం టిఫిన్ చేసే టైమ్‌లో ఎవరన్నా వస్తే.. మనం ఏమని అడుగుతాం?
భార్య : టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం
భర్త : మధ్యాహ్నం భోజనం చేసే టైమ్‌కి ఇంటికి ఎవరన్నా వస్తే?
భార్య : భోజనానికి రండి అని అడుగుతాం
భర్త : మరి పక్కింటి సునీత రాత్రి పడుకునే టైమ్‌కి వచ్చింది. అందుకే పడుకుందాం రండి అని అడిగా. ఇందులో ఏమన్నాతప్పుందా?

మా ఆవిడ పరమ లోభి ‘మా ఆవిడ పరమ లోభి…!” అన్నాడు రాజు
“ఎలా చెప్పగలవు?” అడిగాడు సుందర్ “మాకిద్దరు పిల్లలు కావాలని ముందరనుంచి అనుకుంటున్నాము. వారిద్దరినీ ఒక్కటే కాన్పులో కనేసి ఆస్పత్రి ఖర్చులు మిగిల్చింది..!” అసలు విషయం చెప్పాడు రాజు.

 “రాత్రిళ్లు నా భార్య ముఖం వెలిగిపోతోంది.. ఎందుకని స్వామి?”
స్వామీ.. రాత్రి సమయంలో నా భార్య ముఖం నుంచి తెల్లటి కాంతి వస్తుంది.
దుప్పటి కప్పుకుని ఉన్నా కాంతితో ముఖం వెలిగిపోతూ ఉంటుంది.
నా భార్యకు ఏమైన మహిమలు ఉన్నాయంటారా? స్వామీ?
ఓరీ వెర్రి పుష్పం… రాత్రిపడుకునే ముందు నీ సెల్‌ఫోన్ లాక్ చేసుకో.
నీకు తెలియకుండా నీ భార్య నీ చాటింగ్ మెసేజ్‌లన్నీ దుప్పటికప్పుకుని మరీ చదువుతుంది.
ఆ సెల్‌ఫోన్ కాంతే ఆ వెలుతురు నాయనా.!

“భార్య పట్టుచీర కొంటే.. భర్త ఖుషీ ఖుషీగా ఎందుకుంటాడు? ”
రాజూ నిన్న ఎందుకురా డల్‌గా వున్నావ్?” అడిగాడు సుందర్
నిన్న పట్టుచీర కొనేందుకు నా భార్య రూ.50వేలు ఖర్చు పెట్టిందిరా..! చెప్పాడు బాధగా రాజు అవునా.. అయితే ఈ రోజు హుషారుగా హ్యాపీగా, ఖుషీ ఖుషీగా ఉన్నట్టున్నావే.. ఏంటి సంగతి?” అడిగాడు సుందర్ “ఏముంది.. నా భార్య నిన్న కొన్న పట్టుచీరను నీ భార్యకు చూపెట్టేందుకు వెళ్ళిందిగా..!” అసలు విషయం చెప్పాడు రాజు

Telugu Funny Jokes About Wife And Husband With Telugu Quotes@gurinchi.com
Telugu Funny Jokes About Wife And Husband With Telugu Quotations

“ముందు సీట్లోకిరా..అన్నీ కనిపిస్తాయి….”
బాగా పొద్దుపోయాక భార్య భర్తలు మొబైల్ లో ఇలా మాట్లాడుకుంటున్నారు..
భార్య :ఎక్కడున్నారు..!? ఎందుకు టెన్సన్ గా మాట్లాడుతున్నా‌రు..?
భర్త :నేను కారులో ఉన్నా…! కారు స్టీరింగ్, క్లచ్, బ్రేకు, యాక్సలరేటర్ అన్నీ దొంగలెత్తుకు పోయారు.. ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావ్…?
భార్య: మందు తాగావా..? 😠😠
భర్త :కొద్దిగా తీసుకున్నా..😊 ఐనా నేను కారు గురించి మాట్లాడుతుంటే నువ్వు మందు గురించి మాట్లాడతావేంటి..?
భార్య : ఆ వెనుక సీట్లోనుంచి ముందు సీట్లోకిరా..అన్నీ కనిపిస్తాయి

“భార్య ముందు ఎందుకు తినదో తెలుసా..? ”
భారత దేశంలో భార్య- ముందు భర్తకు వడ్డించి, తరువాత తాను తింటుంది. గమనించారా? ప్రశ్నించాడు రావు – తన విదేశీ మిత్రుని.
బహుశా భోజనంలో హాని కలిగించే పదార్ధాలు ఏమైనా వున్నాయేమో తేల్చుకొని తినడం వారికి అలవాటు కాబోలు… !!అతితెలివిగా బదులిచ్చాడు ఆ విదేశీ మిత్రుడు.

” కలలోకిభార్యరాకూడదంటే..! ”
భార్య భర్తలిద్దరూ మాట్లాడుకుంటూ..
భార్య: ఏమండి నేను ఎప్పుడైనా మీ కలలోకి వచ్చానాభర్త: లేదే
భార్య: ఏందుకు
భర్త: నేను పడుకొనేటప్పుడు హనుమాన్ చాలీసా చదువుకోని పడుకుంటా

“భయం….”
నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను
ఏం….
మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా? కాదు….. నన్ను తోసేస్తుందని.

Telugu Funny Jokes About Wife With Nice Telugu Images@gurinchi.com
Telugu Funny Jokes About Wife With Nice Telugu Images

“భార్య అంత్యక్రియలు.. మారిన వాతావరణం.. భర్త ఏమన్నాడంటే? ”
ఓ భర్త భార్య అంత్యక్రియలు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు.
కొంచెం సేపటికి ఆకాశంలో ఉరుములు, మెరుపులు, తుఫాను,
గాలితో వాతావరణం మారిపోయింది.  వెంటనే అతను ఆకాశం వైపు చూస్తూ..
ఓ.. మా ఆవిడ అక్కడకు చేరుకున్నట్టుంది.. అన్నాడు….!

“భార్యను ఆంగ్లంలో wife అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ”
భార్యను ఆంగ్లంలో wife అని ఎందుకు పిలుస్తున్నారో తెలుసా?”అన్నాడు రమేష్
“తెలియదే..? ఎందుకలా పిలుస్తారు..?” అడిగాడు
సురేష్ Wifeకు అసలు అర్థం ఏమిటో ఇప్పుడే తెలిసింది.
అదేంటంటే? “Without information fight everytime” అని టక్కున సమాధానం ఇచ్చాడు రమేష్.

“రాక్షస ప్రవర్తనకు కారణం ఏమిటి? ”
మీరు ఈ మధ్య మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.. ఎందుకని?” అడిగింది సుందరి
“ఆ మధ్య నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ రక్తమేగా ఎక్కించింది..!” అన్నాడు సుందర్.

“పెళ్ళి రోజు.. కోడిని తీసుకురండి కోసుకుందాం..”
“ఏవండోయ్.. రేపటికి మనకు పెళ్లై 15ఏళ్లు- ఓ కోడిని తీసుకురండి కోసుకుందాం..!”
అంది తాయారమ్మ “తీసుకు రావచ్చు.
కానీ మనం 15ఏళ్ల క్రితం చేసిన తప్పకి దానిని శిక్షించడం ఎందుకా..? అని ఆలోచిస్తున్నాను…!” చెప్పాడు సుందరయ్య.

Telugu Funny Jokes With Quotations@gurinchi.com
Telugu Funny Jokes With Quotations

“స్వర్గంలో కంట్రోల్……”
ఒక సారి దేవుడు స్వర్గలోకంలో ఉన్న భార్య,భర్తలందరిని పిలచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసాడు దేవుడు: భర్తలందరూ రెండు లైన్ లలో నించోండి.
ఒకటో లైన్లో భార్య కంట్రోల్లో ఉండేవారు
రెండో లైన్లో భార్యను కంట్రోల్లో పెట్టేవారు అందరూ ఒకటో లైన్ లోకి వెళ్ళి పోయారు
ఒక్కడు మాత్రం రెండో లైన్లో ఉన్నాడు
దేవుడు: ఆశ్చర్యంగా నువ్వు ఒక్కడివన్నమాట భార్యను కంట్రోల్లో ఉంచేది.
భర్త : ఊరుకోండి సార్.. .. *మా ఆవిడే చెప్పింది నన్ను ఇక్కడ నుంచోమని

“నంబర్ ప్లీజ్……”
భర్త కోసం ఆఫీసుకు ఫోన్ చేసింది ధనలక్ష్మి.
“కొంచెం మా ఆయన్ను పిలుస్తారా?” అడిగింది ఆపరేటర్ని.
“number please” అడిగింది ఆపరేటర్.
“నెంబరేమిటి నీ బొంద. నాకేమైనా పదిమంది మొగుళ్ళనుకున్నావా?” కయ్మంది ధనలక్ష్మి.

” వాగ్దానం”
ఏమండీ… మొన్న ఎన్నికల్లో గెలిస్తే నాకు పదివేల రూపాయల పట్టుచీర కొనిపెడతామన్నారు. గెలిచి ఆర్నెల్లు అయినా మళ్లీ ఆ ఊసు ఎత్త లేదు
గోముగా అన్నది విశాలాక్షి.
ఓట్లకోసం ఎన్నో వాగ్దానాలు చేస్తాం.
అవన్నీ తీరుస్తురా ఎవరైనా విశాలా? అన్నాడా రాజకీయ నాయకుడు.

“విడాకులు తల్లి”
నెల క్రితమేగా పెళ్లైంది. అంతలోనే విడాకులు కావాలంటున్నావు దేనికే..?
కూతురు: మొన్న రాత్రి ఆయన నా మనసును గాయపరిచే మాట అన్నారు
తల్లి: ఏమన్నాడు..?
తల్లి : నాకు వంట చేయడం రాదని అన్నాడు…!

Wife And Husband Telugu Funny Jokes with telugu quotations@gurinchi.com
Wife And Husband Telugu Funny Jokes

” మా ఆవిడ… 40 దొంగలు ”
ముగ్గురు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు
1st : మా ఆవిడ కడుపుతో ఉండగా A Tale of Two Cities అనే నవల చదివింది.
కవల పిల్లలు పుట్టారు.
2nd : Very funny ! మా ఆవిడ కూడా కడుపుతో ఉండగా Three Maskteers అనే బుక్ చదివింది.
దాంతో ముగ్గురు పిల్లలు పుట్టారు.
3rd : ఐతే నేను తర్వాత కలుస్తా… అర్జెంట్ గా ఇంటికెళ్లాలి….
1st & 2nd :  ఏమైంది…?
3rd : ఇందాక నేను వచ్చేటపుడు మా ఆవిడ అలీబాబా40 దొంగలు బుక్ చదువుతోందిరా……!!

“నిజమే, మరి…”
భార్యా భర్తలిద్దరూ ఎప్పట్లాగే వాదులాడుకుంటున్నారు.
భర్త తాను లేకపోతే ఇంట్లో ఏమీ జరగదన్నాడు.
భార్య అసలు తాను గనుక లేకపోతే ఇంటికి కళాకాంతీ ఏమీ లేదు పొమ్మంది.
“ఇంటికి దీపం ఇల్లాలు” అని సామెత కూడా ఉంది అంటూ సాగదీసింది.
నిజమే, మరి… ఆ దీపంతోనే కొంపలు అంటుకుంటున్నాయి అంటూ ముక్కు విరిచాడు భర్త.

“ఫలితం”
భార్యను ఆశ్చర్యపరుద్దామని ఆమె పుట్టింటికి వెళ్ళి వచ్చేలోగా ఓ చీరకు
ఫాలు కుట్టాడు సంతోష్.
భార్య ఎంతో సంతషించింది. గాఢంగా ముద్దు పెట్టింది.
ఇవి కూడా కాస్త కుట్టి పెడతారా? మీకు టైమున్నప్పుడే మరో రెండు చీరలు భర్తకిస్తూ అందామె.

 “ప్రేమ….”
రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు.
పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ ఇస్తుంది.
స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది.
బట్టలు విప్పి నాకు స్వెటర్ వేస్తుంది…చెబుతున్నాడు చింతామణి
అబ్బా… మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట నోరు తెరుస్తూ అన్నాడు భూషణం.
మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా – అసలు విషయం చెప్పాడు చింతామణి

Telugu Jokes And Comedy

Telugu Jokes And Comedy With Nice Images@gurinchi.com
Telugu Jokes And Comedy With Nice Images

“చనిపోయాక జనాలు గుమికూడాలంటే..”
మాధవ్ : స్వామీ.. నేను చనిపోయిన తర్వాత సమాధి చుట్టూత జనాలు గుమికూడాలంటే ఏం చేయాలి స్వామీ?
స్వామీజీ… ఏముంది నాయనా.. నీ సమాధి దగ్గర ఫ్రీ వైఫై సౌకర్యం ఏర్పాటు చెయ్యి.
ఇక చూడ.. మీ పరిసర ప్రాంతాలకు చెందిన జనాలంతా అక్కడకు వచ్చి వాలిపోతారు. రేయింబవుళ్లూ సమాధి వద్దే ఉంటారు.

“సీరియల్ …”
రాధ : బామ్మా… నీకు దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏం అడుగుతావు.
బామ్మ : ఈ వయసులో నాకేం కోరికలుంటాయే స్వర్గం సీరియల్ అయ్యే వరకు బతకనివ్వమంటా.

 “Love bharathiకి Low batteryకి తేడా వుందా? …”
బస్టాప్‌లో భారతి, రామారావు నిలబడి ఉన్నారు.
రామారావు చాలాసేపటి నుంచి ఆమెను సైట్ కొడుతున్నాడు.
కొద్దిసేపటి తర్వాత భారతి పడేల్ పడేల్ మంటూ రామారావును నాలుగు పీకింది.            రామారావు: అదేంటి అలా కొట్టావు?
భారతి : మరి నన్ను సైట్ కొట్టిందే కాకుండా నాకు లవ్ భారత్ అని మెసేజ్ పెడతావా?        రామారావు : నీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు… నేనెలా మెసేజ్ పెడతాను?
భారతి: ఇదిగో చూడు కావాలంటే?
రామారావు : భారతిని నాలుగు పీకి.. అది లవ్ భారతి కాదె… Low battery..! అని చెప్పాడు.

Telugu Jokes And Comedy With Nice Quotations @ gurinchi.com
Telugu Jokes And Comedy With Nice Quotations

“మేకప్‌తో తప్పించుకున్న హీరోయిన్…!”
మొదటి హీరోయిన్: నిన్న షూటింగ్ ముగిసేసరికి ఆలస్యమైంది.
రాత్రిపూట నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే కొందరు తాగుబోతులు కారుకు అడ్డంపడ్డారు. ఆగి హారన్ కొడితే పక్కకు పోకుండా నన్ను కార్లోంచి కిందకు లాగి మీద పడబోయారు.
వెంటనే తెలివిగా ఆలోచించి తప్పించుకున్నాను…
అని పక్కనున్న హీరోయిన్‌కు ఓ హీరోయిన్ చెబుతోంది.
రెండో హీరోయిన్: మరి ఏం చేశావు?
మొదటి హీరోయిన్: మేకప్ మొత్తం చెరిపేసుకున్నా.

“టైలర్…”
ఏంటయ్యా నా ప్యాంట్కు , షర్టుకు జేబులు అస్సలు కుట్టలేదు?
మరి నేను డబ్బులు ఎక్కడ దాచుకోవాలి ?”కోపంగా అన్నాడు పోలీసు వేంకటస్వామి టైలర్ ని. పోండి సార్ భలేవారు మీరు.
పోలీసులెక్కడైనా తమ జేబుల్లోంచి డబ్బు తీసి ఖర్చు చేస్తారా ఏంటి? అందుకు పెట్ట లేదు అన్నాడు టైలర్.

“దానికి దీనికి చెల్లు!”
రామూ, యీ లవ్ లెటర్ తీసికెళ్ళి మీ అక్కకు ఇవ్వు? ఈ కవర్లో కాడ్బరీ చాక్లెట్స్ ఉన్నాయి..
ఇవి కూడా తీసుకో
లెటర్ ఇస్తాలే, చాక్లెట్స్ అక్కర్లేదు!
ఏం? ఎందుకని?
పొద్దున్న మా అన్నయ్య, మీ చెల్లెలికి లవ్ లెటర్ ఇవ్వమంటే, ఇచ్చాను. దానికి దీనికి చెల్లు!

Telugu Comedy Jokes With Nice Images@gurinchi.com
Telugu Comedy Jokes With Nice Images

 “పాన్ కార్డు – పెళ్ళాం లాంటిది.. ఎందుకో తెలుసా?….”
డెబిట్ కార్డు – ఫ్రెండ్ షిప్ లాంటిది ఉన్నదాంతో సర్దుకుంటాం మావా అంటుంది.
క్రెడిట్ కార్డు – గర్ల్ ఫ్రెండ్ లాంటిది స్థాయికి మించి ఖర్చు పెట్టాలనిపిస్తుంది
పాన్ కార్డు – పెళ్ళాం లాంటిది సంపాదించే ప్రతి రూపాయీ తనకు తెలియాలనుకుంటుంది”

“ఆదివారం శలవు….”
రాము: ఏంరా, సోమూ, నువ్వే రోజున పుట్టావు?
సోము: నేను మంగళవారం నాడు పుట్టాను.
రాము: నేనైతే ఆదివారం నాడు పుట్టాను తెలుసా?
సోము: ఊరుకో, ఎవరైనా ఆదివారం నాడు ఎలా పుడతారు? ఆదివారం నాడు శలవు కదా?

“ఎక్కువ చేస్తే..సిమ్ మారుస్తా..!”
ఇద్దరు ప్రేమికులు పార్క్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు
నేను సెల్‌ఫోన్ అయితే నీవు సిమ్‌కార్డు‌వు చెప్పింది రాధ
యురేకా..అంటూ కేకేసి రాధను కౌగిలించుకోబోయాడు గోపి
ఓవర్ యాక్షన్ చేస్తే సిమ్‌కార్డు మార్చేస్తా వార్నింగ్ ఇచ్చింది రాధ

Funny Telugu Comedy Jokes @gurinchi.com
Funny Telugu Comedy Jokes

 ” అతని పేరు ఏడుకొండలు ”
అతనేంటి పేరగడితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవేపు చూపించి వెళ్ళిపోతున్నాడు?
ఓ… అతనా… అతని పేరు ఏడుకొండలు
సోమవారం రోజున ఆయన మౌన వత్రం లేండీ! మాట్లాడడు!

 “కరువు”
ఎక్కడ? ఎక్కడ? అగ్ని ప్రమాదం జరిగిందెక్కడ? ఫైరింజెన్
మీద నుంచి అరిచాడు ఆఫీసర్
అగ్ని ప్రమాదం ఏమీ లేదండయ్యా. పొద్దుట్నించీ పంపుల్లో నీళ్ళు రావడం లేదు.
నీళ్ళ కోసం అలా పిలిచాం. తలా ఒక బిందెడు నీళ్ళుపోసి పుణ్యం కట్టుకోండి బాబయ్య బిందెలు చూపుతూ అన్నారు అక్కడున్న వందమంది మహిళలు

“అనుమానం”
ఏమండీ ! ఇవాళ కొత్త సినిమా ఏదయినా రిలీజ్ అయిందా? అడిగింది అన్నపూర్ణ
ఏం అయినట్టు లేదే, అయినా నీకెందుకొచ్చిందా అనుమానం? అడిగాడు సుందరం
ఎప్పుడూ లేనిది మనవాడు పొద్దున్నే లేచి స్నానం చేసి కాలేజీకి వెళుతున్నానని చెప్పి బయల్దేరితే అనుమానం వచ్చింది… అంది అన్నపూర్ణ.

Funny Telugu Comedy Jokes With HD Wallpapers@gurinchi.com
Funny Telugu Comedy Jokes With HD Wallpapers

“బలమైనచీమ”
ఒకకొలనులోకొన్నిచీమలు ఈదుతున్నాయి.
అంతలో ఏనుగులు కొన్ని వచ్చి ఆ కొలనులో దుంకాయి.
ఆ తాకిడికి చీమలన్నీ ఎగిరిపోయాయి.
ఒక చీమ మాత్రం ఎగిరి ఒక ఏనుగుమీద పడింది.
మిగిలిన చీమలన్నీ అరిచాయి ఉత్సాహంగా:”దాన్నిముంచేయిరా,ముంచేయి!”అని.

 “అతి తెలివి”
రాము: హలో!!
కోతి: హలో!!
రాము: నేను ఎలా అంటే నువ్వూ అలా అనగలవా?
కోతి: సరే.
రాము: నేను పెద్ద మనిషిని.
కోతి: నేను పెద్ద మనిషిని.
రాము: నేను చిన్న మనిషిని.
కోతి: నేను చిన్న మనిషిని.
రాము: నేను బేవార్సును.
కోతి: కరెక్ట్. నువ్వు అదే.

“మగవాళ్ళకు మాత్రమే”
ఓ కంపెనీలో అందరూ మగాళ్ళను, అందునా పెళ్ళైన వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నారు. పైగా ఆడవాళ్ళు అర్హులు కాదంటూ నోటిఫికేషన్లోద రాయడంతో మండిపడ్డ మహిళా సంఘాలు ధర్నా చేశాయి. అసలు విషయం కనుక్కుంటే ఆ కంపెనీ యజమాని ఒక మహిళ.
ఈ విషయం తెలిసిన మహిళా సంఘం నేతలు మరింత కోపం కలిగింది.
ఆ యజమానిని ఈ విధంగా కోపంగా ప్రశ్నించారు “ఒక మహిళ అయ్యుండీ ఏమిటా నోటిఫికేషన్?” “అబ్బే… మాకే విపక్షా లేదండి.
ఇది ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కంపెనీ. చెబితే వినేవాళ్ళు, ఆదేశాల్ని తక్షణం పాటించేవాళ్ళు, కోప్పడ్డా ఎదురుతిరగనివాళ్ళు కావాలి మాకు.
అన్నిటికంటే ముఖ్యంగా ఆఫీస్ అవర్స్ అయిపోగానే తక్షణం ఇంటికి వెళ్ళాలనిపించకూడదు.” అసలు విషయం చెప్పింది అధినేత.

Telugu Doctor Jokes

Telugu Doctor Jokes With Quotations @ gurinchi.com
Telugu Doctor Jokes With Quotations

” ఆపరేషన్ అయ్యాక బంధువులకు అప్పగిస్తాం!….”
డాక్టర్.. ఏమిటి నర్స్… రేపు ఆపరేషన్ చేయాల్సిన పేషెంట్ చెప్పాపెట్టకుండా పారిపోతున్నాడు?. ఏంటి సంగతి?
నర్స్: ఆపరేష్ అయ్యాకం ఏం చేస్తారని రోగి అడిగాడు సార్…
డాక్టర్: ఓకే… నీవు ఏమని సమాధానం చెప్పావ్..
నర్స్: ఆపరేషన్ అయ్యాక మీ బంధువులకు అప్పగిస్తామని పొరపాటున అనేశాను సార్…

“మందు వేసుకోకపోయినా మత్తుగా ఉంటే? ”
ఏంటో డాక్టర్.. ఏమందు వేసుకోకపోయినా వళ్ళంతా మత్తుగా వుంటోంది…! అన్నాడు రాజేష్ ఉండండి.. బిల్లు ఇస్తాను.. మత్తు దానంతట అదే దిగిపోతుంది..! బదులిచ్చాడు డాక్టర్.

” లేడీస్  హాస్టల్ ”
పేషంట్ : ఈమధ్య కళ్లు బాగా లాగేస్తున్నాయి డాక్టర్.
డాక్టర్ : పరీక్షించి కొన్నాళ్ల పాటు లేడీస్ హాస్టల్ వైపు వెళ్లడం మానేయండి.

Jokes Between Doctor And Patient@gurinchi.com
Jokes Between Doctor And Patient

 “బాక్సింగ్”
ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి.
“ఊ కొట్టు… కొట్టు…. దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి” అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి. “మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?” అడిగాడు పక్కనున్న వ్యక్తి.
“కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని” చెప్పాడు దంతనాధం

“వంశ పారంపర్యం…. ”
వెంకయ్యగారూ… ఈ జబ్బు మీతో రాలేదు.
వంశపారంపర్యంగా వచ్చింది.
ఆపరేషన్ చేస్తే పోతుంది” చెప్పాడు డాక్టర్.
“అమ్మయ్య… బతికించారు.
అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి” చెప్పాడు వెంకయ్య.

“ఇంగ్లీషు మీడియం”
బాబూ ఏది నీ నోరు చూపించు, అ, ఆ.. అను” అన్నాడు డాక్టర్ రాముతో.
పక్కనే ఉన్న రాము తండ్రి “మా వాడు english medium అండీ అ, ఆలు రావు” అన్నాడు డాక్టర్తోా

Funny Telugu Doctor Jokes With Nice Images@gurinchi.com
Funny Telugu Doctor Jokes With Nice Images

” ప్లాస్టిక్ సర్జరీ ”
పేషంట్:- డాక్టర్ గారూ, ప్లాస్టిక్ సర్జరీ కి ఎంతవుతుంది?
డాక్టర్;- ఏభై వేలు.
పేషంట్:-  ప్లాస్టిక్ మేం తెచ్చుకుంటే?
డాక్టర్;-  కోపంతో…..లక్ష అవుతుంది..కరిగించి అతికించాలి కదా.

“లింగం మావ – మూత్ర పరీక్ష”
కాస్తంత జ్వరంగా ఉంటే డాక్టర్ దగ్గిరికెళ్లాడు లింగం మావ.
డాక్టర్ మూత్ర పరీక్ష చేయించుకురమ్మని రాస్తే ల్యాబ్కుల వెళ్లాడు.
తన వంతు కోసం వేచి చూస్తూంటే పక్కనే ఓ వ్యక్తి ఏడుస్తూ కనిపించాడు “ఎందుకేడుస్తున్నావు ” పలకరించాడు లింగం మావ.
“Doctor నన్ను రక్త పరీక్ష చేయించుకు రమ్మన్నారు”
“అయితే” “రక్తం కోసం సూదితో వేలి చివర పొడిచారు.
నొప్పిగా ఉన్నది” అంతే…. ల్యాబ్ నుంచి ఒక్క పరుగున బయటికెళ్ళి పోయాడు లింగం మావ…

“డిజైనర్ కుట్లు”
డాక్టర్: నీకు బాగా ఎక్కువగా దెబ్బ తగిలింది.
20 కుట్లు  పడతాయి.
పేషంట్ : కుట్లు వేస్తే వేశారు కానీ మంచి డిసైనర్ కుట్లు వేయండి

Telugu Jokes Teacher Student

Telugu Jokes Teacher Student@gurinchi.com
Telugu Jokes Teacher Student

“క్వశ్చన్ పేపర్”
ఎక్సామ్ హాల్ లో క్లాస్ లో ఒక స్టూడెంట్ తన సర్ కి క్వషన్ పేపర్ చూపించి
సర్ ఇదేమిటి అని అడిగాడు. క్వషన్ పేపర్ అని సర్ అన్నారు.
ఆ తర్వాత ఆన్సర్ షీట్ చూపించి ఇదేమిటి అని అడిగాడు.
సర్ ఆన్సర్ షీట్ అని ఆనాడు.
సర్ ఇది చాలా అన్యాయం కదా.
క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఇచ్చారు
కానీ ఆన్సర్ పేపర్ లో మాత్రం ఆన్సర్స్ ఇవ్వలేదు అన్నాడు.

” టీచర్ బయటకు పంపించేశారేమిటి?”
బంటి : నాన్నా… చూచి రాత మంచిదేనా?
తండ్రి: చాలా మంచిది… రోజూ రాయాలి
బంటి : నిన్న పరీక్షలో జవాబు చూచి రాస్తుంటే టీచర్ బయటకు పంపించేశారేంటి?

“చూడడానికి…..”
టీచర్ : రామూ వర్షం వచ్చినపుడు మెరుపులు ఎందుకు వస్తాయి.
రామూ : భూమి పూర్తిగా తడిసిందో లేదో చూడ్డానికి టీచర్.

Telugu Jokes Teacher Student@gurinchi.com
Funny Telugu Jokes Teacher Student

“దేవుడి భక్తి ”
రామ్ : మా టీచర్ కి దేవుడి భక్తి చాలా ఎక్కువ
శ్యామ్ : ఎందుకు ఆలా అనుకుంటున్నావు?
రామ్: ఎందుకు అంటే తాను అడిగిన ప్రశ్నలకి నేను ఎప్పుడు సమాధానం చెప్పినా ఓరి దేవుడా అని అంటూ ఉంటుంది.

“అవి పడుకున్నాక మనం పడుకోవాలి టీచర్ ”
దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా.
ఉమ : నాకు తెలుసు టీచర్.
టీచర్: చెప్పు మరి
ఉమ: అవి పడుకున్నాక మనం పడుకొవాలి.

telugu jokes with telugu quotes
Telugu Funny Jokes With Telugu Quotations
telugu funny jokes with telugu quotations
Telugu Jokes Funny

Also Read